Mon Dec 23 2024 07:09:06 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియా దెబ్బకు టోర్నీ నుండి పాక్ అవుట్
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా బుధవారం జరిగిన హాకీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాక్ ను భారత జట్టు చిత్తు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లో పాక్ పై 4-0 తేడాతో భారత్ గెలిచింది. లీగ్ దశను ఒక్క ఓటమి కూడా లేకుండా భారత్ ముగించింది. భారత్ ఇదివరకే సెమీస్ చేరగా, పాక్ జట్టు ఆశలపై భారత్ నీళ్లు చల్లింది. టీమిండియా టేబుల్ టాపర్ గా లీగ్ స్టేజ్ ను ముగించింది. పాక్ ఒక్క మ్యాచ్ మాత్రమే నెగ్గింది.
గ్రూప్ దశ తర్వాత భారత్ గ్రూప్ లో అగ్రగామిగా నిలిచింది, పాకిస్తాన్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు, రెండు గోల్స్ పెనాల్టీ కార్నర్ల నుండి వచ్చాయి. మూడో క్వార్టర్లో మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు జుగ్రాజ్ సింగ్. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా, జుగ్రాజ్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్ చెరో గోల్ చేశారు. హర్మన్ ప్రీత్ సింగ్ 15, 23 నిమిషాలలో గోల్ కొట్టి భారత్ ను అధిక్యంలో నిలిపాడు. 36వ నిమిషంలో జుగ్ రాజ్ సింగ్ సింగ్ గోల్ చేయడంతో భారత్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యా్చ్ ముగియడానికి 5 నిమిషాల ముందు ఆకాష్ దీప్ సింగ్ మరో గోల్ గొట్టడంతో ప్రత్యర్థి పాక్ పై భారత్ 4-0 గోల్స్ తేడాతో పూర్తి ఆధిక్యం కనబరిచింది.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశ ముగిసింది. శుక్రవారం చెన్నై లోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో భారత్ తలపడనుంది. ఐదో మ్యాచ్‌డేలో భారత్ 4-0తో పాకిస్థాన్‌ను ఓడించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, జపాన్ 2-1తో చైనాను ఓడించి 4వ స్థానంలో నిలిచింది.
Next Story