Tue Dec 24 2024 01:58:27 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పాకిస్థాన్ తో తలపడనున్న భారత్.. టాస్ గెలిచిన పాక్
టాస్ గెలిచిన పాక్
భారత జట్టు పాకిస్థాన్ తో నేడు తలపడబోతోంది. విమెన్స్ ఆసియా కప్ లో భాగంగా భారతజట్టు పాక్ తో తలపడనుంది. ఈ టోర్నమెంట్ కూడా టీ20 ఫార్మాట్ లో సాగనుంది. బంగ్లాదేశ్ లోని సిల్హెట్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ తీసుకుంది.
యూఏఈపై భారత్ విజయం సాధించిన మూడు రోజుల తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ లో తలపడనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. గురువారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ నాలుగు వికెట్ల తేడాతో ఓడి ఈ పోటీలో అడుగుపెట్టింది. యుఏఈతో జరిగిన ముందు మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు విశ్రాంతి ఇవ్వబడింది, ఈ మ్యాచ్ లో ఆమె తిరిగి జట్టులోకి వచ్చింది. షఫాలీ వర్మ ను తప్పించారు.
పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI) - సిద్రా అమీన్, మునీబా అలీ (WK), బిస్మాహ్ మరూఫ్ (C), ఒమైమా సోహైల్, నిదా దార్, అలియా రియాజ్, అయేషా నసీమ్, సాదియా ఇక్బాల్, తుబా హసన్, ఐమన్ అన్వర్, నష్రా సంధు.
భారత మహిళలు (ప్లేయింగ్ XI) - హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (WK), దయాళన్ హేమలత, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గయాక్వాడ్, రాధా యాదవ్.
Next Story