Tue Dec 24 2024 00:10:44 GMT+0000 (Coordinated Universal Time)
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు జట్టు ప్రకటన.. అతడిని కావాలనే పక్కన పెడుతున్నారా..?
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ ముగిసిన అనంతరం మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్ లో
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ ముగిసిన అనంతరం మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్ లో పాల్గొనే టీమిండియాను ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వన్డే జట్టుకు శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా నియమించారు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అక్టోబరు 6న తొలి వన్డే జరగనుంది. అక్టోబరు 9న రెండో వన్డే, అక్టోబరు 11న మూడో వన్డే జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం ముఖేశ్ కుమార్, రజత్ పాటిదార్ జాతీయ జట్టులో అరంగేట్రం చేయనున్నారు. అవేష్ ఖాన్, సిరాజ్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ కూడా వన్డే జట్టుకు ఎంపికయ్యారు. పృథ్వీ షాకు దక్కని చోటు దక్కకపోవడం వివాదాస్పదం అవుతోంది.
టీమిండియా వన్డే జట్టు:
శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మాన్ గిల్, రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేశ్ కుమార్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్.
టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్:
గువాహటిలో హోరాహోరీగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 16 పరుగుల తేడాతో నెగ్గింది. భారీ లక్ష్యం ఛేదించడం కోసం డేవిడ్ మిల్లర్, డికాక్ బాగా పోరాడారు. మిల్లర్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డికాక్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 69 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 2-0తో చేజిక్కించుకుంది. చివరి మ్యాచ్ ఈ నెల 4న ఇండోర్ లో జరగనుంది.
Next Story