Sun Dec 22 2024 23:20:01 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచిన రోహిత్.. ఎవరిని పక్కన పెట్టారంటే?
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ మీద ఘన విజయం సాధించిన భారత్ నేడు శ్రీలంకతో తలపడనుంది
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ మీద ఘన విజయం సాధించిన భారత్ నేడు శ్రీలంకతో తలపడనుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజున జరగగా ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా భారత్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్ తో ఆడిన జట్టు నుండి కేవలం శార్దూల్ ఠాకూర్ ను పక్కన పెట్టారు. అతడి స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(సి), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరణ.
ఆసియా కప్ సూపర్ -4లో భాగంగా శ్రీలంకతో కొలంబో వేదికగానే భారత్ తలపడనుంది. భారత్ మ్యాచ్లకు వరుణుడి గండం తప్పేలా లేదు. శ్రీలంకతో మ్యాచ్లో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ రిపోర్ట్ చెబుతోంది.
Next Story