Fri Nov 22 2024 22:10:32 GMT+0000 (Coordinated Universal Time)
సెంచరీతో దుమ్ము దులిపిన కోహ్లీ.. ధీటుగా బదులిస్తున్న విండీస్
విండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లోకి మంచి స్కోరు సాధించింది.
విండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లోకి మంచి స్కోరు సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 288/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 438 పరుగులకు ఆలౌట్ అయింది. 87 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ (121; 206 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీ చేశాడు. 180 బంతుల్లో శతకం పూర్తీ చేసుకున్నాడు. కోహ్లీ నాలుగున్నరేళ్ల తర్వాత విదేశీ గడ్డపై విజయం సాధించాడు. జడేజా (61; 152 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, ఆర్ జడేజా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరినా ఆర్ అశ్విన్ (56; 78 బంతుల్లో 8 ఫోర్లు) అమూల్యమైన పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ (25), జయదేవ్ ఉనద్కత్ (7), మొహ్మద్ సిరాజ్ (0)లు వరుసగా పెవిలియన్ చేరారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, వారికన్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్ లో విండీస్‌కు ఓపెనర్లు క్రైగ్ బ్రాత్‌వైట్, త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (33) శుభారంభం ఇచ్చారు. అయితే చందర్‌పాల్.. జడేజా బౌలింగ్‌లో అశ్విన్‌కు దొరికిపోయాడు. 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెకంజీ ఓ సిక్స్, ఫోర్ బాదిన అనంతరం రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 86/1 స్కోరుతో నిలిచింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (37), కిర్క్ మెకంజీ (14) క్రీజులో ఉన్నారు. విండీస్ జట్టు ఇంకా 352 పరుగుల వెనుకంజలో ఉంది.
Next Story