Mon Dec 23 2024 20:14:32 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మూడో వన్డే.. వైట్ వాష్ దిశగా
భారత్ - వెస్టిండీస్ ఆఖరి వన్డే నేడు అహ్మదాబాద్ లో జరగనుంది
భారత్ - వెస్టిండీస్ ఆఖరి వన్డే నేడు అహ్మదాబాద్ లో జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన భారత్ ఈ సిరీస్ ను వైట్ వాష్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉంది. మూడో వన్డేలోనూ విజయం సాధించి వెస్టిండీస్ పై పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించాలన్న పట్టుదలతో భారత్ ఉంది. అయితే మూడో వన్డే నామమత్రం కావడంతో కుర్రోళ్లకు అవకాశాలు ఇస్తారని అంటున్నారు. ఈ మ్యాచ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడే అవకాశాలున్నాయి.
రెండు జట్లలో...
ఇక రెండు వన్డేల్లోనూ పరాజయం పాలయి నిరాశతో ఉన్న వెస్టిండీస్ జట్టు ఈ చివరి వన్డేలోనైనా విజయం సాధించాలని చూస్తుంది. ఈ జట్టులోనూ అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొందరికి విశ్రాంతి నిచ్చి మరికొందరికి అవకాశం కల్పించాలని రెండు జట్లు భావిస్తున్నాయి. నామమాత్రమే కావడంతో ఇరు జట్లు ఈ మ్యాచ్ లో ప్రయోగం చేయనున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.
- Tags
- india
- west indies
Next Story