Fri Apr 25 2025 10:45:01 GMT+0000 (Coordinated Universal Time)
Champions Trophy : ట్రోఫీ ఈసారి ఎవరిదో? మనోళ్లు ఏం చేస్తారో?
ఛాంపియన్ ట్రోఫీలో భారత్ ఆడనుంది. ఇప్పటికే దుబాయ్ చేరుకున్న టీం ఇండియా జట్టు ప్రాక్టీసుముమ్మరం చేసింది

ఛాంపియన్ ట్రోఫీలో భారత్ మరికొద్ది రోజుల్లో ఆడనుంది. ఇప్పటికే దుబాయ్ చేరుకున్న టీం ఇండియా జట్టు ప్రాక్టీసుముమ్మరం చేసింది. భారత్ ఎ గ్రూపులో ఉంది. ఈ గ్రూపులో పాకిస్థాన్ తో పాటు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లు ఉన్నాయి. వన్డే మ్యాచ్ లలో భారత్ ప్రస్తుతం పటిష్టంగానే ఉంది. సినియర్ ఆటగాళ్లు మొన్నటి ఇంగ్లండ్ జట్టు పర్యటనతో ఫామ్ లోకి వచ్చారు. రోహిత్ శర్మ ఇటీవల సెంచరీ చేసి పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. విరాట్ కోహ్లి కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మరో సీనియర్ ఆటగాడు కెఎల్ రాహుల్ కూడా ఫామ్ల ోకి వచ్చినట్లే కనపడుతుంది. మూడు దేశాలతో ఆడే మ్యాచ్ లలో ఖచ్చితంగా గెలిస్తేనే సెమీస్ కు చేరుతాయి. లేకుంటే సెమీస్ చేరడం కూడా ఇండియాకు కష్టంగా మారుతుంది.
తక్కువగా అంచనాలు....
న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లను తక్కువగా అంచనాలు వేయడానికి వీలులేదు. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ లోనే జరుగుతుండటంతో పాటు ఇటీవల ఇంగ్లండ్ పై సిరీస్ గెలిచిన నేపథ్యంలో అదే దూకుడు ప్రదర్శించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే పాకిస్థాన్ కూడా గతంలో మాదిరిగా కాదు. ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాపై భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. అందుకే పాకిస్థాన్ ను దుబాయ్ వేదికగా మట్టికరిపించాలంటే అంత సులువు కాదు. మరోవైపు బంగ్లాదేశ్ ను కూడా తక్కువగా అంచనా వేయలేం. అంచనాలు లేకుండా వచ్చే జట్లు అనేక సార్లు ఫామ్ లో ఉన్న జట్లను ఓడించిన ఘటనలను చూశాం.
మంచి ఫామ్ లో...
న్యూజిలాండ్ ను కూడా అంత తేలిగ్గా తీసి పారేయలేం. మన దేశంలోనే న్యూజిలాండ్ జట్టు సిరీస్ ను సొంతం చేసుకుంది. అందుకుని టీం ఇండియాను అది తేలిగ్గానే తీసుకుంటుంది. న్యూజిలాండ్ ప్లేయర్లందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు టీం ఇండియాకు కావాల్సింది ఆత్మవిశ్వాసంతో పాటు సరైన ప్రణాళిక అవసరం అని చెబుతున్నారు. నిలకడగా ఆడటంతో పాటు భారీ స్కోరు దిశగా పయనిస్తేనే ప్రత్యర్థిపై వత్తిడి పెంచే అవకాశముంది. మరొకవైపు టాస్ కూడా ఈ మ్యాచ్ లలో కీలక భూమిక పోషించే అవకాశముంది. మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీలో మనోళ్లు ఫైనల్ వరకూ చేరి ప్రత్యర్థిని మట్టి కరిపించి కప్ ను కొట్టేయాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.
Next Story