Mon Dec 23 2024 12:03:07 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ నేడు న్యూజిలాండ్ తో ఢీ
మహిళల వన్డే ప్రపంచ కప్ లో నేడు భారత్ న్యూజిల్యాండ్ తో పోటీ పడుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
మహిళల వన్డే ప్రపంచ కప్ లో నేడు భారత్ న్యూజిల్యాండ్ తో పోటీ పడుతుంది. ఈ మ్యాచ్ లో ఇప్పటికే భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ ప్రపంచ కప్ లో భారత్ కు ఇది రెండో మ్యాచ్. పాకిస్థాన్ పై గెలిచి మంచి ఊపు మీదున్న భారత్ జట్టు న్యూజిలాండ్ ను కూడా ఓడిస్తామన్న నమ్మకంతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ ఫలితం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కొద్దిరోజుల ముందు...
అయితే భారత్ జట్టు కొద్ది రోజుల ముందు భారత్ జట్టును నాలుగు వన్డేల్లో న్యూజిలాండ్ ఓడించింది. అందువల్ల ఈ మ్యాచ్ లో తమదే గెలుపని న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. భారత్ జట్టులో పెద్దగా మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. న్యూజిలాండ్ ను అతి తక్కువ స్కోర్ కు ఆల్ అవుట్ చేయగలిగితే భారత్ విజయావకాశాలు మెరుగుపడే అవకాశాలున్నాయి.
- Tags
- india
- newzealand
Next Story