Mon Dec 23 2024 01:59:49 GMT+0000 (Coordinated Universal Time)
India vs South Africa Second Odi : కొట్టేయండి బాసూ.. మీకు అడ్డేముంది.. దీంతో క్లోజ్ చేసేయండి
ఇండియా నేడు రెండో వన్డేలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గబేరాలో ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది.
ఇండియా నేడు రెండో వన్డేలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గబేరాలో ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి వన్డేలో భారత్ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. సునాయాసంగా గెలిచింది. ప్రధానంగా తొలి వన్డేను బౌలర్లు గెలిపించారనే చెప్పాలి. ప్రధానంగా అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్ లు దక్షిణాఫ్రికా జట్టు వెన్ను విరిచి గేమ్ తమ వైపునకు తిప్పుకోగలిగారు. ఇక మిగిలిన తంతు బ్యాటర్లు పూర్తి చేశారనుకోండి. జోహెన్స్ బర్గ్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించే పిచ్ కాగా, ఇది మాత్రం పెద్దగా పరుగులు చేయనివ్వదని పిచ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పిచ్ పై మాత్రం స్పిన్నర్ల విజృంభించే అవకాశముందని తెలుస్తోంది.
ఈ మ్యాచ్ గెలిస్తే...
ఈ మ్యాచ్ గెలిస్తే ఇక సిరీస్ ను గెలుచుకున్నట్లే. అయితే అంత తేలిక కాదు. మొదటి వన్డేలో సొంత గడ్డపై ఓడిపోయామన్న కసి సఫారీలో కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గిలిచి సిరీస్ ను సమం చేసి మూడో మ్యాచ్ లో తేల్చుకోవాలని దక్షిణాఫ్రికా జట్టు గట్టిగా భావిస్తుంది. అందుకే ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఈ మ్యాచ్ చేజారిపోయే అవకాశముంది. అందుకే బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించగలిగితేనే ఈ మ్యాచ్ ను గెలుచుకుని సిరీస్ ను సొంతం చేసుకునే వీలుంటుంది. అలా కాకుండా మొదటి మ్యాచ్ గెలిచాం కదా? అని ఏమాత్రం అలక్ష్యంగా ఉన్నా చేజారిపోయే ప్రమాదముందన్న హెచ్చరికలున్నాయి.
బలంగా భారత్ జట్టు...
అయితే ప్రస్తుత భారత్ జట్టు బలంగా ఉంది. బ్యాటింగ్ పరంగా తిరుగులేదు. అందరూ నిలబడి స్కోరును పెంచగలిగిన వాళ్లే. రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజిత్ పటీదార్, శాంసన్, కేఎల్ రాహుల్ శాంసన్ వరకూ అందరూ బ్యాటర్లే. బౌలర్లే కొంత డౌట్ కొడుతుంది. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్, కులదీప్ సింగ్ దిగే అవకాశాలున్నాయి. అర్ష్దీప్ సింగ్, అవేశ్ కాన్ ముకేశ్ కుమార్ లు రాణిస్తే చాలు. ఇక దాదాపు గెలిచినట్లే. అందుకే ఆచితూచి ఆడి సిరీస్ ను ఈ మ్యాచ్ తోనే చేజిక్కించుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మనోళ్లు ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. అసలు సమయానికి చేతులెత్తేయకుండా ఉంటే చాలు అంతే.
Next Story