Mon Dec 23 2024 10:21:47 GMT+0000 (Coordinated Universal Time)
India Vs South Africa T20 : నేడు తొలి టీ20... దుమ్మురేపడం ఖాయమా?
ఇండియా నేడు దక్షిణాఫ్రికాతో తొలి టీ20 లో తలపడనుంది. డర్బన్ వేదికగా రాత్రి 730 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది
నేడు మరో టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలో జరగనున్న టీ 20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ 20 నేడు జరగనుంది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో తొలి టి 20 జరగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే జట్టులో ఉన్న వాళ్లంతా యువ ఆటగాళ్లే. సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో దక్షిణాఫ్రికాకు యువజట్టు పయనమయి వెళ్లింది.
సీనియర్లు లేకున్నా...
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రాలు ఈ సిరీస్ లకు దూరంగా ఉన్నారు. కుర్రాళ్లే గెలుపో? ఓటమో? అనేది తెగించి పోరాడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాపై ఇటీవల సొంత గడ్డపై గెలిచిన సీరిస్ తో యువజట్టు ఉత్సాహంగా ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాలో ఆడటం కొంత కష్టమేనని పరిశీలకుల అంచనా. అందుకే ఈ మ్యాచ్ లో గెలుపోటములు చివర వరకూ ఎవరూ తేల్చని పరిస్థితి నెలకొంది. బంతి బంతికి.. పరుగు పరుగు.. పరుగుకూ ఉత్కంఠ తప్పదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.
బలంగా భారత్....
అయితే యువజట్టు బౌలింగ్, బ్యాటింగ్ పరంగా బలంగానే ఉంది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్ లు దూకుడుగా ఆడితేనే భారీ లక్ష్యం నిర్దేశించే అవకాశముంది. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లో ఉండటం టీం ఇండియాకు కలసి వచ్చే అంశం. ఇక రింకూ సింగ్ డెత్ ఓవర్లలో సిక్సర్ల మోత మోగిస్తాడు. జితేష్ శర్మ కూడా బ్యాటింగ్ పరంగా రాటు దేలి ఉండటంతో పెద్దగా భయం లేుద. ఇక దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, కులదీప్ యాదవ్, సిరాజ్, ముఖేశ్ లు కూడా ఉండటంతో బౌలింగ్ పరంగా కూడా పటిష్టంగానే ఉంది. మరి దక్షిణాఫ్రికాను ఆ దేశంలో ఓడించడగలిగితే అంతకంటే ఏముంటుంది.
Next Story