Sat Dec 21 2024 02:20:36 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైఓల్టేజీ మ్యాచ్
దాయాది దేశం పాకిస్థాన్ తో నేడు భారత్ మరోసారి తలపడుతుంది. ఆసియాకప్ లో నేడు భారత్ - పాక్ మ్యాచ్ జరగబోతోంది.
అవును మరోసారి నరాలు తెగే ఉత్కంఠ.. బాల్ .. బాల్ కు టెన్షన్. దాయాది దేశం పాకిస్థాన్ తో నేడు భారత్ మరోసారి తలపడుతుంది. ఆసియాకప్ లో నేడు భారత్ - పాక్ మ్యాచ్ జరగబోతోంది. గత ఆదివారం ఉత్కంఠతో తన ఖాతాలో విజయాన్ని చేర్చుకున్న భారత్ మరోసారి గెలిచేందుకు అన్ని విధాలుాగా సిద్ధమయింది. నువ్వా? నేనా? అన్నట్లు తలపడే జట్లు కావడంతో ఉత్కంఠ సహజంగానే ఉంటుంది. ఆసియా కప్ లో గ్రూప్ సూపర్ 4కు సులువుగా ప్రవేశించిన భారత్ నేడు పాక్ తో అమితుమీ తేల్చుకోనుంది.
జడేజా దూరమయి....
అయితే భారత్ కు ఆల్ రౌండర్ జడేజా దూరమయ్యాడు. జడేజా కులి మోకాలి గాయంతో బాధపడుతుండటంతో ఆయన స్థానంలో అక్షరపటేల్ కు స్థానం కల్పించనున్నారు. అక్షరపటేల్ కూడా ఆల్ రౌండర్ కావడంతో ఇండియాకు కొంత ఊరట కల్గించే అంశమే. అదేసమయంలో పాకిస్థాన్ జట్టును కూడా తీసిపారేయలేం. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటుతూ వస్తుంది. గత మ్యాచ్ ను తృటిలో చేజార్చుకున్న పాక్ ఈసారి కసితో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అలాంటి మ్యాచ్ ను మరోసారి చూడబోతున్నాం. బలమైన జట్లు రెండు తలపడుతుండటంతో ఆసియా కప్ లో నేడు అదిరేటి మ్యాచ్ జరగబోతుంది. రాత్రి 7 గంటలకు దుబాయ్ లో ఈ మ్యాచ్ జరగనుంది.
Next Story