Mon Dec 23 2024 11:49:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జింబాబ్వేతో భారత్ రెండో వన్డే
నేడు జింబాబ్వే తో భారత్ రెండో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే వన్డే సిరీస్ ను దక్కించుకున్నట్లే.
నేడు జింబాబ్వే తో భారత్ రెండో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే వన్డే సిరీస్ ను దక్కించుకున్నట్లే. ఇప్పటికే తొలి వన్డే మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని భారత్ సాధించింది. మూడు వన్డేల్లో ఇండియా 1 - 0 ఆధిక్యతతో భారత్ ఉంది. ఈరోజు హరారే వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను దక్కించుకోవాలని ఇండియా భావిస్తుంది. తొలి వన్డేలో భారత బౌలర్లు, బ్యాటర్లు రాణించడంతో విజయం లభించింది.
తక్కువ అంచనా....
అయితే జింబాబ్వే జట్టును కూడా తక్కువగా అంచనా వేయ కూడదు. బంగ్లాదేశ్ పై వన్డే , టీ 20 సిరీస్ లను సాధించిన జింబాబ్వే జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగానే ఉంది. జింబాబ్వేను కట్టడి చేయడం భారత్ కు కష్టమేమీ కాదని చెబుతున్నా ఆ జట్టు తీరును పరిశీలిస్తే అంత సులువు కాదని అంటున్నారు క్రీడా నిపుణులు. ఈరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ కు భారత్ జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా దిగే అవకాశాలున్నాయని తెలిసింది.
Next Story