Mon Dec 23 2024 19:55:53 GMT+0000 (Coordinated Universal Time)
నేడు భారత్ - దక్షిణాఫ్రికా రెండో టీ 20
దక్షిణాఫ్రికాతో భారత్ నేడు రెండో టీ 20 మ్యాచ్ ఆడనుంది. ఇండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలనుకుంటుంది.
దక్షిణాఫ్రికాతో భారత్ నేడు రెండో టీ 20 మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన టీం ఇండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. దక్షిణాఫ్రికా ఓటమి పరాభావంతో కసితో గెలుపు కోసం ఎదురు చూస్తుంది. దక్షిణాఫ్రికా జట్టును అంత తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. బౌలర్లు రాణిస్తేనే మరోసారి విజయం టీం ఇండియా పరమవుతుందన్నది విశ్లేషకుల అంచనా.
ీఈ మ్యాచ్ గెలిస్తే...
దక్షిణాఫ్రికా కూడా ఈ మ్యాచ్ గెలిచి 1 -1 సమం చేయాలని చూస్తుంది. తొలి మ్యాచ్ లో భారత్ బౌలర్లు దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్ దెబ్బకు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈసారి రెండు జట్లు భారీ స్కోరు చేయగలిగితే అవతలి జట్టును నిలువరించే అవకాశముంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. పేసర్ బూమ్రా స్థానంలో సిరాజ్ కు అవకాశం కల్పించారు. అయితే సిరాజ్ ను ఈ మ్యాచ్ లో ఆడిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story