Sat Mar 15 2025 18:39:55 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఇండియా వెస్టిండీస్ వన్ డే
వెస్టిండీస్ తో వన్ డే మ్యాచ్ లో ఇండియా నేడు తలపడనుంది. ప్రస్తుతం టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది

వెస్టిండీస్ తో వన్ డే మ్యాచ్ లో ఇండియా నేడు తలపడనుంది. ప్రస్తుతం టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో పోరు జరగనుంది. తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ పై గెలిచేందుకు టీం ఇండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఇంగ్లండ్ పై వన్డే, టీ 20 సిరీస్ లను గెలిచిన టీం ఇండియా వెస్టిండీస్ మీద గెలిచేందుకు ఉత్సాహంగా ఉంది.
శిఖర్ దావన్ కెప్టెన్సీగా...
అయితే ఈ మ్యాచ్ కు శిఖర్ థావన్ కెప్టెన్సీగా వ్యవహరిస్తున్నారు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నారు. దీంతో థావన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. థావన్, శుభమన్ గిల్ తో కలసి భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. బౌలింగ్, బ్యాటింగ్ లో పటిష్టంగా ఉన్న భారత జట్టు వెస్టిండీస్ పై గెలవాలని ఉత్సాహంతో ఉంది. సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకునేందుక వెస్టిండీస్ సిద్ధంగా ఉంది.
Next Story