Mon Dec 23 2024 06:48:02 GMT+0000 (Coordinated Universal Time)
ఆసీస్ మీద ఘన విజయం సాధించిన భారత్
IND-W vs AUS-W 1st T20I: ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్‌లో ఘోరమైన ఓటమిని మూట గట్టుకున్న భారత మహిళల జట్టు
IND-W vs AUS-W 1st T20I: ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్‌లో ఘోరమైన ఓటమిని మూట గట్టుకున్న భారత మహిళల జట్టు.. తొలి టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తు చిత్తు చేసింది. యంగ్ పేసర్ టిటాస్ సాధు (4/17) కెరీర్ బెస్ట్ బౌలింగ్ తో రాణించగా ఆసీస్ జట్టు ఓ మోస్తరు స్కోరుకు మాత్రమే పరిమితమైంది. ఇక భారత ఓపెనర్లు షెఫాలీ వర్మ (44 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 నాటౌట్), స్మృతి మంధాన (52 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 54) సూపర్ బ్యాటింగ్ తో రెచ్చిపోవడంతో భారత్ ఏ దశలోనూ ఆసీస్ కు అవకాశం ఇవ్వలేదు. దీంతో తొలి టీ20లో ఇండియా 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 19.2 ఓవర్లలో 141 రన్స్‌కే ఆలౌటైంది. లిచ్‌ఫీల్డ్ (49), ఎలైస్ పెర్రీ (37) తప్ప మిగతా ఆసీస్ బ్యాటర్లు ఫెయిలయ్యారు. స్టార్ ప్లేయర్ బెత్ మూనీ (17)ని టిటాస్ సాధు నాలుగో ఓవర్లో పెవిలియన్ చేర్చి ఆసీస్ కు షాక్ ఇచ్చింది. తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ హీలీ (8)ని రేణుక ఔట్ చేయగా.. మెక్‌గ్రాత్ (0), ఆష్లే గార్డ్నర్ (0)ను వరుస బాల్స్‌లో అవుట్ చేసిన టిటాస్ ఆసీస్‌ను 33/4తో కష్టాల్లో పడేసింది. ఈ దశలో పెర్రీ, లిచ్‌ఫీల్డ్ జట్టును ఆదుకున్నారు. ఆ సమయంలో ఆసీస్ స్కోరు 13 ఓవర్లకు స్కోరు వంద దాటింది. ఓ స్లో బాల్‌తో లిచ్‌ఫీల్డ్‌ను ఔట్ చేసిన అమన్‌జోత్ కౌర్ ఐదో వికెట్‌కు 79 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసింది. ఆ వెంటనే గ్రేస్ హారిస్ (1) శ్రేయాంకా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. సదర్లాండ్ (12)ను టిటాస్ ఔట్ చేయగా.. దీప్తి శర్మ ఒకే ఓవర్లో పెర్రీ, మేగన్(1) ను అవుట్ చేయగా. వారెహమ్ (5)ను శ్రేయాంకా చివరి వికెట్‌గా ఔట్ చేసింది. ఈ మ్యాచ్ లో శ్రేయాంకా పాటిల్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. టిటాస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండో టీ20 ఆదివారం జరుగుతుంది.
Next Story