Thu Dec 19 2024 16:42:56 GMT+0000 (Coordinated Universal Time)
ఇంగ్లండ్ ను దారుణంగా ఓడించిన టీమ్ ఇండియా
ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు
ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 347 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ ను మూడ్రోజుల్లోనే ఓడించింది. కొన్ని సెషన్స్ కూడా బాగా ఆడలేకపోయారు ఇంగ్లండ్ బ్యాటర్లు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో 428 పరుగుల భారీ స్కోరు సాధించింది. శుభా సతీశ్ (69), జెమీమా రోడ్రిగ్స్ (68), యస్తికా భాటియా (66), దీప్తి శర్మ (67) అర్ధసెంచరీలు నమోదు చేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 49, స్నేహ్ రాణా 30 పరుగులు చేశారు. ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ 5 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత మహిళల జట్టు 6 వికెట్లకు 186 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ముందు 479 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లండ్ మహిళలు చేతులెత్తేశారు. 131 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీప్తి శర్మ 4 వికెట్లు తీయగా, పేసర్ పూజా వస్త్రాకర్ 3, రాజేశ్వరి గైక్వాడ్ 2, రేణుకా సింగ్ 1 వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ కెప్టెన్ హీదర్ నైట్ అత్యధికంగా 21 పరుగులు చేసింది. టీ20 సిరీస్ ను ఇంగ్లండ్ మహిళలు ఎగరేసుకుపోగా.. టెస్ట్ మ్యాచ్ ను భారత జట్టును కైవసం చేసుకుంది.
Next Story