Fri Nov 22 2024 23:29:18 GMT+0000 (Coordinated Universal Time)
India vs Afghanistan : రోహిత్ మొహంలో నెత్తురు చుక్కలేదు.. సిరీస్ గెలిచినా ఆనందం లేదు..రీజన్ ఇదే
ఇండియా - ఆప్ఘనిస్తాన్ ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లోనూ భారత్ సునాయాసంగా విజయం సాధించింది
ఇండియా - ఆప్ఘనిస్తాన్ ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లోనూ భారత్ సునాయాసంగా విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆప్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 172 పరుగుల చేసింది. చూసేందుకు ఇది భారీ స్కోరే. ఇరవై ఓవర్లకు 172 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. అర్హదీప్ మూడు, రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అయితే తర్వాత బరిలోకి దిగిన భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సొంతం చేసుకుంది.
ఎప్పటిలాగే...
అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటిలాగానే డకౌట్ అయ్యాడు. వరసగా రెండు మ్యాచ్ లోనూ రోహిత్ పరిస్థిితి ఇదే. వికెట్లు కంటి ముందే పైకి లేవడంతో రోహిత్ భాయ్ కు ఏం చేయాలో కూడా పాలుపోలేదు. ఆప్ఘనిస్తాన్ పై వరసగా డకౌట్ అయిన రోహిత్ శర్మ ప్రేక్షకుల ముందు తలెత్తుకోలేకపోయాడు. గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకుల హావభావాలు కూడా ఎప్పుడూ ఇంతేనా? అంటూ పెదవి విరుపులు కనిపించాయి. అవి లైవ్ లో ప్రసారం అవ్వడంతో రోహిత్ ఇక తట్టుకోలేకపోయాడు. ఇంత దారుణంగా రెండు మ్యాచ్ లలోనూ అవుట్ కావడం అంటే రోహిత్ శర్మకు కాదు.. కెప్టెన్సీకే పరాభావం అన్నట్లుగా క్రికెట్ అభిమానులు చూడటం విశేషం.68 పరుగులు చేసిన యశస్వి అందులో ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయంటే ఇక చూసుకోండి.
నోరెళ్లబెట్టి చూడాల్సిందే...
అయితే యశస్వి జైశ్వాల్, విరాట్ కొహ్లి కుదరుకుని ఆడటంతో రోహిత్ శర్మ అవుట్ అయిన తీరును జనం మర్చిపోయారు. కొహ్లి 29 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కొహ్లి కూడా ఫోర్లతో మోత మోగించాడు. ఇక యశస్వి జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలా కొట్టాడంటే అక్షరాల్లో చెప్పడం కష్టం. ఆ షాట్లు చూసి తీరాల్సిందే. యశస్వి కొట్టిన సిక్సర్లను చూసి అక్కడ కూర్చున్న విరాట్ కొహ్లి, రోహిత్ శర్మలు కూడా నోరెళ్ల బెట్టారంటే ఆ షాట్ల గురించి స్పెషల్ గా ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు. ఆప్ఘనిస్తాన్ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు.
దూబే తోడు కావడంతో...
యశస్వి జైశ్వాల్ కు శివమ్ దూబే తోడయ్యాడు. ఇక చెప్పాల్సిన పనిలేదు. శివమ్ దూబే 63 పరుగులు చేశాడు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ చేశాడు. దూబే కొట్టిన ఒక సిక్సర్ దెబ్బకు విజిటర్స్ గ్యాలరీలో పడిందంటే స్ట్రోక్ ఏ మాత్రం ఉందో చూసి తీరాల్సిందే. అలా టీం ఇండియా వరసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఆప్ఘనిస్తాన్ పై సిరీస్ ను గెలిచినా రోహిత్ ఫెయిలవ్వడంతో చివరకు ప్రెజెంటేషన్ సెర్మనీలోనూ అతగాడి మొహంలో ఆనందం లేదు. అంతే కొత్త జనరేషన్ చూపిస్తున్న దూకుడికి మనోడు కొంత ఇబ్బంది పడినట్లే కనిపించింది. నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సొంతం చేసుకుంది.
Next Story