Fri Nov 08 2024 17:42:34 GMT+0000 (Coordinated Universal Time)
తొలి వన్డేలో భారత్ దే విజయం
వెస్టిండీస్ తో భారత్ తొలి వన్డేలో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠ రేపింది.
వెస్టిండీస్ తో భారత్ తొలి వన్డేలో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ఉత్కంఠత రేపింది. చివరి వరకూ మ్యాచ్ ఎవరిదన్నది ఆసక్తికరంగా ఉంది. చివరకు భారత్ కు విజయం వరించింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత్ శుభారంభాన్ని చేసింది. ఓపెనర్స్ గా దిగిన శిఖర్ థావన్, గిల్ లు అద్భుతంగా రాణించారు. ధావన్ మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యారు. గిల్ రన్ అవుట్ కావడంతో క్రీజ్ లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా అర్థశతకం చేసి రాణించారు. అయ్యర్ అవుటయిన తర్వాత వరసగా వెస్టిండీస్ బౌలర్లు భారత్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపారు. భారత్ 308 భారీ స్కోరున వెస్టిండీస్ ముందు ఉంచింది.
చివరి ఓవర్లో...
అయితే తర్వాత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ బ్యాటర్లను తొలి ఓవర్లలోనే సిరాజ్ దెబ్బతీశాడు. ఐదో ఓవర్లో షై హోప్ ను ఔట్ చేయడంతో భారత్ కు విన్నింగ్ ఛాన్సెస్ మెరుగుపడినట్లేనని అనుకునన్నారు. కానీ కైలే మేయర్స్, బ్రూక్స్ అద్భుతంగా ఆడటంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. టైలెండర్లు కొంత మ్యాచ్ ను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నించినా భారత్ బౌలర్లు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి ఓవర్ లో పది హేను పరుగుల అవసరం అయింది. అయితే 11 పరుగులు చేసిన వెస్టిండీస్ చేతులెత్తేసింది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ తొలి మ్యాచ్ ను భారత్ కైవసం చేసుకుంది.
Next Story