Mon Mar 31 2025 09:44:16 GMT+0000 (Coordinated Universal Time)
India vs England One Day : గెలిచారు.. కానీ అనుకున్నట్లే సీనియర్ల సీన్ మారలేదే?
ఇండియా - ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే లో భారత్ విజయం సాధించింది. నాగపూర్ లో విక్టరీ కొట్టింది

ఇండియా - ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే లో భారత్ విజయం సాధించింది. నాగపూర్ లో విక్టరీ కొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. అయితే సీనియర్ ఆటగాళ్ల ఆట తీరు మారలేదన్నది మళ్లీ ఈ వన్డేలోనూ అర్థమయింది. ఆ ముగ్గురు లేకపోతే ఈ వన్డే కోల్పోయేవాళ్లమని లెక్కలు చెబుతున్నాయి. గతకొంత కాలంగా సీనియర్ ఆటగాళ్లు ఫామ్ లో లేక అవస్థలు పడుతున్నారు. పరుగులు చేయలేక, తక్కువ పరుగులకే అవుట్ అవుతున్నారు. ఇక్కడ కూడా యువ క్రీడాకారులే భారత్ ను ముందుండి నడిపిస్తున్నారు. ఈ మ్యాచ్ లోనూ సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కె.ఎల్. రాహుల్ విఫలం కావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.
తక్కువ పరుగులకే...
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లకే ఆల్ అవుట్ అయింది. 248 పరుగుల చేసింది. మన బౌలర్లు కట్టడి చేయబట్టి ఇది సాధ్యమయింది. వన్డేలో 249 పరుగుల లక్ష్యమంటే తక్కువేనని చెప్పాలి. షమి ఒకటి, హర్షిత్ రాణా మూడు, అక్షర్ పటేల్ ఒకటి, జడేజా మూడు, కులదీప్ యాదవ్ ఒక వికెట్ తీయడంతో ఇది సాధ్యమయింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బట్లర్, బెతెల్ అర్థ సెంచరీలు చేశారు. సాల్ట్ 32 పరుగులు చేశారు. మిగిలిన వారిని తక్కువ పరుగులకే అవుట్ చేయగలిగారు. అయితే తొలి వన్డే ఆడిన హర్షత్ రాణా తన బంతితో ఒక ఆటాడుకోవడంతో ఇంగ్లండ్ జట్టు చేతులెత్తేసింది. జడేజా స్పిన్ మాయాజాలం కూడా పనిచేయడంతో తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగింది.
లక్ష్యాన్ని ఛేదించడంలో...
అయితే తర్వాత 249 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ విఫలమయ్యారు. రోహిత్ రెండు పరుగులకే వెనుదిరిగాడు. యశస్విజైశ్వాల్ పదిహేను పరుగులు చేసి అవుటయ్యాడు. కేఎల్ రాహుల్ ఐదు పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. ఇలా సీనియర్ ఆటగాళ్లు విఫలమయినా కుర్రోళ్లు బ్యాట్ ను విజృంభించడంతో భారత్ విజయం సాధ్యమయింది. శుభమన్ గిల్ 87 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 59 పరుగులు, అక్షర్ పటేల్ 52 పరుగులు చేయడంతో కేవలం 38.4 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలిగింది. దీంతో భారత్ తొలి విజయాన్ని ఇంగ్లండ్ పై నమోదు చేసుకుంది. విరాట్ కోహ్లి గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు.
Next Story