Mon Dec 23 2024 12:29:12 GMT+0000 (Coordinated Universal Time)
T 20 : వన్ సైడ్ విక్టరీ
లంకతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం వన్ సైడ్ గానే అనిపించింది
శ్రీలంకతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం వన్ సైడ్ గానే అనిపించింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లో భారత్ తన సత్తాను మరోసారి చాటింది. ఇప్పటికే వెస్టిండీస్ పై టీ 20, వన్డే మ్యాచ్ లలో క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు అదే ఊపును కొనసాగిస్తున్నట్లే కన్పిస్తుంది. లక్నో లో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలకంపై 62 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత్ బ్యాటింగ్....
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఆరంభంలోనే అదరగొట్టింది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ భాగస్వామ్యంతో భారత్ కు భారీ స్కోరు లభించింది. ఇషాంత్ కిషన్ 89, రోహిత్ 44, శ్రేయస్ అయ్యర్ 54 పరుగులు చేసి భారత్ కు 199 పరుగులను సాధించిపెట్టారు. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక తొలి ఓవర్లోనే తడబాటు పడింది.
తడబడిన శ్రీలంక...
తొలి ఓవర్ లోనే భువనేశ్వర్ కుమార్ కు వికెట్ లభించింది. ఇక వరసగా శ్రీలంక వికెట్లు ఒక్కొక్కటిగా పడుతుండటంతో శ్రీలంక ఓటమి ముందుగానే డిసైడ్ అయింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ లలో చరిత్ అసలంక ఒక్కడే 53 పరుగులు చేశారు. మిగిలిన వాళ్లంతా తక్కువ స్కోరుకే అవుటయ్యారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇషాంత్ కిషన్ కు దక్కింది. రెండో టీ 20 ధర్మశాలలో జరగనుంది
Next Story