Sun Apr 13 2025 13:27:45 GMT+0000 (Coordinated Universal Time)
India vs England First T20 : సీనియర్లూ.. సిగ్గుపడండి.. ఆట చూశారా? గంటలో ముగించారుగా?
కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో భారత్ - ఇంగ్లండ్ తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది

సీనియర్ ఆటగాళ్లు సిగ్గుపడేలా యువ ఆటగాళ్లు చెలరేగిపోయారు. నిన్న జరిగిన భారత్ - ఇంగ్లండ్ తొలి టీ 20 మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా ఇదే భావన కలుగుతుంది. అలా వచ్చి ఇలా వెళ్లి పోవడం కాదు. క్రీజులో నిలబడి సిక్సర్లు, ఫోర్లు బాదుతుంటే చూసేందుకు భారత్ లోని కోట్ల సంఖ్యలో కళ్లు ఆనందంతో మెరిశాయి. ఎన్నాళ్లకెన్నాళ్లకు. ఇది ప్రపంచ పోటీ కాకపోవచ్చు. వరల్డ్ కప్ కానే కాకపోవచ్చు. అయినా వరస ఓటములతో టీం ఇండియా కుదేలైన వేళ ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్న సమయంలో కుర్రోళ్లు చెలరేగిపోయిన తీరు చూస్తుంటే శభాష్ అని అనిపించక మానదు. అందుకే సీనియర్ ఆటగాళ్లు ఈ ఆట చూసైనా సిగ్గు తెచ్చుకుంటే మేలు అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
బౌలర్లు కట్టడి చేసి..
భారత్ - ఇంగ్లండ్ తొలి టీ 20 మ్యాచ్ కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతే కాదు తమ ఇన్నింగ్స్ ను గంటలో ముగించింది. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్లను మన బౌలర్లు బాగా కట్టడి చేయగలిగారు. ఇంగ్లండ్ ను కేవలం 132 పరుగులకే ఆల్ అవుట్ చేయగలిగాలరు. అర్హదీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి బౌలర్లుగా తమ సత్తాను చూపించగలిగారు. అర్హదీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా రెండేసి వికెట్లు, వరుణ్ చక్రవర్తి మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగలిగారు దీంతో ఇంగ్లండ్ బ్యాటర్లు చిత్తయిపోయారు. అప్పుడే ఇండియా గెలుపు ముంగిట నిలుచున్నట్లయింది. అందుకు తక్కువ స్కోరు కావడంతో అందులోనూ టీ 20లో అది సులువుగా చేయవచ్చన్న నమ్మకాన్ని మనోళ్లు మరోసారి నిలబెట్టుకున్నారు.
షేక్ చేసిన అభిషేక్...
ఇక తర్వాత బ్యాటింగ్ కు దిగిన మనోళ్లు ఓపెనర్లు మాత్రమే రఫ్ ఆడించారు.ఇంగ్లండ్ బౌలర్లకు రప్పా రప్పా అనిపించేలా బ్యాట్ ను ఝుళింపించారు. సంజూ శాంసన్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. అయితే 23 పరుగుల వద్ద అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెనువెంటనే అవుటయ్యాడు. తర్వాత ఆ స్థానంలో తిలక్ వర్మ వచ్చాడు. ఇక అభిషేక్ వర్మ ఇంగ్లండ్ బౌలర్లను షేక్ చేశాడు. ఎనిమిది సిక్సర్లు, ఐదు ఫోర్లతో భారత్ ను గెలుపు ముంగిట ఉంచాడు. ఆ దూకుడేంది సామీ అన్నట్లుగా అభిషేక్ శర్మ తీరు సాగింది. అభిషేక్ శర్మ 70 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చిఅవుటయ్యాడు. అయితే అదే సమయంలో తిలక్ వర్మ నిదానంగా ఆడుతూ ఆటను విజయపథాన నడిపించాడు. చివర్లో వచ్చిన హార్థిక్ పాండ్యా మూడు పరుగులు, తిలక్ వర్మ 19 పరుగులు చేసి కేవలం 12 ఓవర్లలోనే విజయం దక్కింది. 9 గంటలకు మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ మొదలయితే.. 10 గంటలకల్లా అంటే... గంటలో ముగించారు మనోళ్లు.
Next Story