Sun Dec 22 2024 17:47:42 GMT+0000 (Coordinated Universal Time)
Ind vs Australia T20 : టెన్షన్ పెట్టారు.. రింకూ సింగ్ లేకపోతే... ఊహించుకోవడం కష్టమే
విశాఖలో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో భారత్‌వి ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
విశాఖలో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఉత్కంఠ మధ్య విజయం సాధించింది. రింకూసింగూ చివరకు సిక్సర్ బాదడంతో విజయం భారత్ పరమయింది. రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో మనోళ్లు మళ్లీ టెన్షన్ పెట్టారు. ఆసీస్ ఎక్కువ పరుగులు చేయడం, ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో ఒక దశలో ఇండియాకు ఓటమి తప్పదని అందరూ భావించారు.
ఇద్దరూ కలసి...
కానీ అంచనాలను తలకిందులను చేస్తూ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు ఇద్దరూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఆసీస్ బౌలర్లను చితకబాదుతూ స్కోరు బోర్డును పరుగులు తీయించారు. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీస్, స్మిత్ లు నిలకడగా ఆడుతూ ఆస్ట్రేలియా స్కోరును 200 లకు దాటించడంతో భారత్ ఛేదనలో 209 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇది టీ 20లలో అత్యధిక పరుగులే. దీనిని ఛేజింగ్ చేయడం అంటే మాటలు కాదు. ఆషామాషీ కాదు. ప్రతి బంతినీ వదలకుండా బాదుతూనే ఉండాల్సిన పరిస్థితి.
రింకూసింగ్ నిలబడి...
ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు మ్యాచ్ ను మలుపు తిప్పారు. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అవుటయ్యాడు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ కూడా వెంటనే వెనుదిరిగారు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఎనభై పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ సూర్య అవుట్ అయిన వెంటనే వరసగా వికెట్లు పడ్డాయి. రింకూ సింగ్ ఒక్కడే క్రీజులో నిలదొక్కుకున్నాడు. ఒక్క పరుగు ఒక్క బాల్ ఉన్న పరిస్థితుల్లో రింకూ సింగ్ సిక్సర్ బాది భారత్ కు విజయాన్ని అందించాడు. ఐదు మ్యాచ్ ల సిిరీస్ లో భారత్ 1 - 0 ఆధిక్యతను సంపాదించుకుంది.
Next Story