Thu Dec 26 2024 13:17:32 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Autralia : తొలి టెస్ట్ లో భారత్ విజయం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్ట్ వన్ సైడ్ గా జరిగింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆల్ అవుట్ కాగా, ఆస్ట్రేలియా 104 పరుగులకే అవుట్ అయింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 487 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా లక్ష్యం 534 పరుగులు కావడంతో దాదాపు నిన్ననే భారత్ విజయం ఖాయమయింది.
భారీ పరుగుల తేడాతో...
ఈరోజు బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 238 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా, సిరాజ్ తలో మూడు వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ రెండు వెంకెట్లు, నితీష్ రెడ్డి, హర్షిత్ రానా చెరో వికెట్ తీసి ఆసిస్ ను దెబ్బకొట్టారు. దీంతో భారత్ తొలి టెస్ట్ లో విజయం సాధించినట్లయింది.రెండో ఇన్నింగ్స్ లో భారత్ బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతోనే ఈ విజయం ఖాయమైంది.
Next Story