Sun Dec 22 2024 18:24:14 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం
ఇండియా - బంగ్లాదేశ్ ల మధ్య జరగుతున్న తొలిటెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగోరోజే ఆట ముగిసింది.
ఇండియా - బంగ్లాదేశ్ ల మధ్య జరగుతున్న తొలిటెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగోరోజే ఆట ముగిసింది. 518 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ స్వల్ప పరుగులకే అవుటయింది. షకీబ్ అవుటయిన తర్వాత టయిలండర్లందరూ అవుట్ కావడంతో బంగ్లాదేశ్ చెన్నైలోని తొలి టెస్ట్‌లోనే ఓటమిని మూట గట్టుకుంది.
280 పరుగుల తేడాతో...
ఇండియా బంగ్లాదేశ్ పై 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిందిద. 515 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 234 పరుగులకు ఆల్ అవుట్ కావడంతో తొలి టెస్ట్ భారత్ పరమయింది. మూడు వికెట్లు తీసిన జడేజా, అశ్విన్ ఆరు వికెట్లు, బూమ్రా ఒక వికెట్ తీయడంతో బంగ్లా పతనం తప్పలేదు. తొలి టెస్ట్‌లో భారత్ జట్టు సమిష్టిగా రాణించింది.
Next Story