Mon Dec 23 2024 13:15:12 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగో టీ 20లో భారత్ విజయం.. సిరీస్ సొంతం
వెస్టిండీస్ తో జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది
వెస్టిండీస్ తో జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ ను గెలుచుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్ టీ 20 సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. నాలుగో టీ 20లో 59 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. పెద్దగా కష్టపడకుండానే భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ బౌలర్లు, బ్యాట్స్మెన్లు విఫలం కావడంతో భారత్ కు సునాయాస విజయం లభించింది.
భారత్ బౌలర్లు....
టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాట్స్ మెన్లలో రిషబ్ పంత్ అత్యధికంగా 44 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ, 33, సంజూ శాంసన్ 30, సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేసి భారత్ 191 పరుగులు చేశారు. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లను భారత బౌలర్లు కట్టడి చేశారు. అర్షదీప్ సింగ్ కు 3 వికెట్లు, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ లు తలా రెండు వికెట్లు తీసి వెస్టిండీస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించారు. దీంతో భారత్ విజయం ఖాయమయింది. సిరీస్ భారత్ సొంతం చేసుకుంది.
Next Story