Mon Dec 23 2024 16:31:25 GMT+0000 (Coordinated Universal Time)
సిరీస్ టీం ఇండియాదే... రెండో వన్డేలోనూ?
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. సిరీస్ ను కైవసం చేసుకుంది.
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. సిరీస్ ను కైవసం చేసుకుంది. చివరి పది ఓవర్లలో వంద పరుగులు చేయాల్సి ఉండగా అక్షర్ పటేల్ విజృంభించి భారత్ కు విజయాన్ని సాధించి పెట్టారు. సొంతగడ్డపైనా వెస్టిండీస్ వన్డే సిరీస్ ను కోల్పోయింది. భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 311 పరుగులు చేసింది. హోప్ సెంచరీతో భారత్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. కెప్టెన్ పూరన్ సయితం అర్థశతకంతో రాణించాడు.
భారీ లక్ష్యమే అయినా...
టీం ఇండియా ముందు భారీ లక్ష్యమే ఉంది. 312 పరుగులు చేయాల్సి ఉంది. ఇందులు శుభమన్ గిల్ 43, శ్రేయస్ అయ్యర్ 63, సంజూ శాంసన్ 54, దీపక్ హుడా 33 పరుగులు చేశారు. అయినా చివరి పది ఓవర్లలో భారత్ కు 100 పరుగులు రావాల్సి ఉంది. అయితే అక్షర్ పటేల్ 64 పరుగులు చేసి భారత్ కు విజయం సాధించి పెట్టారు. బ్యాటర్లు రాణించకపోయినా బౌలర్ గా ఉన్న అక్షర్ పటేల్ టీం ఇండియాకు సిరీస్ దక్కేలా చేయగలిగాడు.
Next Story