Mon Dec 23 2024 19:52:04 GMT+0000 (Coordinated Universal Time)
దటీజ్ టీ 20.. చాలా రోజుల తర్వాత మంచి మ్యాచ్
రెండో టీ 20లో భారత్ దే విజయం అయింది. దీంతో టీ 20 సిరీస్ ను కూడా భారత్ చేజిక్కించుకున్నట్లయింది
నరాలు తెగే ఉత్కంఠ. మ్యాచ్ చేజారిపోయినట్లే అనిపించింది. అయినా అదృష్టం భారత్ వైపు నిలిచింది. రెండో టీ 20లో భారత్ దే విజయం అయింది. దీంతో టీ 20 సిరీస్ ను కూడా భారత్ చేజిక్కించుకున్నట్లయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ధాటిగానే ఆడింది. రోహిత్, ఇషాంత్ కిషన్ త్వరగా అవుటయినా కోహ్లి నిలదొక్కుకున్నారు 52 పరుగులు చేశాడు. తర్వాత పంత్, వెంకటేశ్ అయ్యర్ మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇరవై ఓవర్లలో 187 పరుగులు చేసి వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.
చివరి రెండు ఓవర్లే.....
తర్వాత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండిస్ భారత్ బౌలర్లను ఉతికి ఆరేసింది. పావెల్, పూరన్ లు బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. అయితే చివరి రెండు ఓవర్లలో భారత బౌలర్లు ఆటను పూర్తిగా తమ వైపునకు తిప్పుకున్నారు. చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు చేయాల్సి ఉంది. అయితే 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్ లో 25 పరుగులు చేయాల్సి వచ్చింది. వెస్టిండీస్ కు కష్టంగా మారింది. అయితే పావెల్ వరసగా రెండు సిక్సర్లు బాదడంతో బౌలర్ హర్షల్ పటేల్ బెంబేలెత్తి పోయాడు. అయితే చివరకు ఎనిమిది పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత మంచి మ్యాచ్ ను ప్రేక్షకులు చూసినట్లయింది.
- Tags
- india
- west indies
Next Story