Mon Dec 23 2024 20:23:56 GMT+0000 (Coordinated Universal Time)
అతడి వల్లే గెలుపు.. సిరీస్ సొంతం
భారత్ దక్షిణాఫ్రికాపై రెండో టీ 20 మ్యాచ్ గెలిచింది. సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది.
భారత్ దక్షిణాఫ్రికాపై రెండో టీ 20 మ్యాచ్ గెలిచింది. సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో అనేక విషయాలు అర్థమయ్యాయి. డెత్ ఓవర్లలో మన బౌలింగ్ మెరుగుపడలేదన్నది మరోసారి నిరూపితమయింది. 17 ఓవర్ లో దీపక్ చాహర్ పొదుపుగా బౌలింగ్ చేయకుంటే భారత్ ఈ మ్యాచ్ లో ఓటమి చవి చూసేదే. అర్హదీప్ వేసిన నో బాల్స్, వైడ్స్, ఇచ్చిన పరుగులు చూసి ఎవరికైనా ఈ అనుమానం కలగక మానదు. అర్హదీప్ రెండు వికెట్లు తీసినా, 62 పరుగులు ఇవ్వడం ఇప్పుడు భారత్ బౌలింగ్ పట్ల అభిమానులకు ఆందోళన కల్గిస్తుంది. ఎన్ని పరుగులు.. ఎన్ని షాట్లు.. కళ్లు చెదిరిపోయే షాట్లు ఈ మ్యాచ్ లో రెండు జట్లలో చూశాం.
పరుగుల వరద....
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ అర్థశతకం చేశాడు. రోహిత్ శర్మ 43 పరుగులు చేశాడు. విరాట్ కొహ్లి 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక సూర్యకుమార్ చెలరేగి ఆడి 61 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. భారత్ టీ 20లోనే అత్యధికంగా 237 పరుగులు చేశాడు. 238 పరుగుల లక్ష్యంతో దిగిన దక్షిణాఫ్రికా ఎప్పటి లాగానే మూడు వికెట్లను చేజార్చుకుంది. ఆ తర్వాత డీకాక్, మిల్లర్లు విధ్వంసం సృష్టించారు. మిల్లర్ అయితే ఏకంగా సెంచరీ చేసేశాడు. విజయం అనుకున్నంత తేలిగ్గా దక్కలేదు. టెన్షన్ పెట్టింది. కేవలం 16 పరుగులతో దక్షిణాఫ్రికా ఓటమి పాలయింది. భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది.
Next Story