Mon Apr 14 2025 02:46:17 GMT+0000 (Coordinated Universal Time)
బంగ్లాపై భారత్ ఘన విజయం
మూడో వన్డే లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించింది. 227 పరుగులతో భారత్ గెలుపొందింది

మూడో వన్డే లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించింది. 227 పరుగులతో భారత్ గెలుపొందింది. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కొహ్లి సెంచరీ చేసి భారత్ కు భారీ పరుగులు తెచ్చి పెట్టారు. భారత్ యాభై ఓవర్లలో 409 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం భారత్ ఉంచగలిగింది.
తక్కువ స్కోరుకే...
తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. భారత్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్, విరాట్ కొహ్లి రాణించారు. తర్వాత బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 182 పరుగులకే ఆల్ అవుట్ అయింది. బంగ్లా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోవడంతో భారత్ విజయం ఖాయమైంది. అయితే మూడు వన్డేల సిరీస్ ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. తొలి రెండు వన్డేలను గెలుచుకున్న బంగ్లాదేశ్ మూడో వన్డేలో ఓటమి పాలయింది.
Next Story