Fri Dec 20 2024 10:08:26 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచిన భారత్
భారత్ - న్యూజిలాండ్ తొలి మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచింది. రాంచీలో మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది
భారత్ - న్యూజిలాండ్ తొలి మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచింది. రాంచీలో మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయనుంది. భారత్ బౌలర్లు విజృంభించి తక్కువ పరుగులకు కట్టడి చేయగలిగిేతేనే భారత్ విజయం సాధ్యమవుతుంది.
యువ ఆటగాళ్లతో...
భారత్ యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతుంది. హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండు జట్లకు ప్రతిష్టాత్మకమే. ఇప్పటికే వన్డే సిరీస్ ను కోల్పోయిన న్యూజిలాండ్ పరువును నిలుపుకునేందుకు టీ 20 లలో లయినా గెలవాల్సి ఉంది. భారత్ కూడా టీ 20లలో గెలిచి తన సత్తా చాటాలని భావిస్తుంది. పరుగుల వరదతో రాంచీ స్టేడియం మరికాసేపట్లో దద్దరిల్లుతుంది.
Next Story