Wed Apr 23 2025 00:15:50 GMT+0000 (Coordinated Universal Time)
India vs Australia T 20 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీం ఇండియా
తొలి టీ 20లో భారత్ టాస్ గెలిచింది. తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించింది

తొలి టీ 20లో భారత్ టాస్ గెలిచింది. తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ 20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారీ పరుగులు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే అవుట్ చేయాల్సి ఉంటుంది.
ఛేజింగ్ లో...
బ్యాటింగ్ పరంగా పటిష్టమైన స్థితిలో ఉన్న టీం ఇండియా భారీ పరుగులు చేస్తుందని ఫ్యాన్స్ కూడా నమ్మకంగా ఉన్నారు. ఛేజింగ్ లో ఇండియాకు ఇబ్బంది ఉండకపోవచ్చన్న అంచనాలు వినపడుతున్నాయి. ఓపెనర్ల నుంచి చివర వరకూ ఆల్ రౌండర్లు ఉండటం కూడా టీం ఇండియాకు కలసి వచ్చే అంశంగా భావించవచ్చని చెబుతున్నారు. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story