Sun Dec 14 2025 18:17:41 GMT+0000 (Coordinated Universal Time)
India Vs New Zealand : చెత్తగా ఆడారు.. 46 పరుగులకే అవుటయ్యారు
భారత్ న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్‌లో చేతులెత్తేసింది. 46 వికెట్లకే ఆల్ అవుట్ అయింది.

భారత్ న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్‌లో చేతులెత్తేసింది. 46 వికెట్లకే ఆల్ అవుట్ అయింది. హేమాహేమీలంతా ఒక్క పరుగు చేయకుండానే వెనుదిరిగారు. బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్ట్ లో ీటీం ఇండియా కేవలం 31.2 ఓవర్లలోనే 46 పరుగులకు ఆల్ అవుట్ అయింది. టీం ఇండియాలో ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు.
అందరూ పెవిలియన్ కే...
రిషబ్ పంత్ ఇరవై , యశస్వి జైశ్వాల్ 15 పరుగులు చేశారు. మిగిలిన వారంతా తక్కువ పరుగులకే అవుటయ్యారు. విరాట్ కోహ్లి, అశ్విన్, సర్ఫరాజ్ ఖాన్ లు డకౌట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ ఐదు వికెట్లు తీసి భారత్ ను చావు దెబ్బతీశాడు. ఓరౌర్కీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంత చెత్తగా అవుటయింది ఎప్పుడూ లేదు. ఇంత తక్కువ స్కోరుకు అవుటయింది లేదు.
Next Story

