Fri Mar 28 2025 18:24:35 GMT+0000 (Coordinated Universal Time)
India vs New Zealand Champions Trophy : మన బౌలర్లు ఓకే.. ఇక బ్యాటర్లపైనే భారమంతా
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత బౌలర్లు కివీస్ బ్యాటర్లను కట్టడి చేయగలిగారు

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత బౌలర్లు కివీస్ బ్యాటర్లను కట్టడి చేయగలిగారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ స్పెల్ లో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లను వరసగా పెవిలియన్ పట్టించడంలో సక్సెస్ అయ్యారు. ప్రధానంగా న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మెన్లు రచిన్ రవీంద్ర, విలియమ్స్ ను త్వరగా అవుట్ చేయడంతో స్కోరు న్యూజిలాండ్ కెప్టెన్ ఆశించినంత మేరకు రాలేదనే చెప్పాలి. తొలి పది ఓవర్లలో 69 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ మూడు వందలకు పైగానే పరుగులు చేస్తుందని అందరూ భావించారు. అంత భారీ లక్ష్యాన్ని ఛేదించం భారత్ కు కష్టంగా మారుతుందన్న అంచనాలు కూడా వినపడ్డాయి.
రన్ రేట్ తక్కువగా ఉన్నా...
అయితే భారత్ స్పిన్నర్లు సరైన సమయంలో వికెట్లు తీశారు. కులదీప్ యాదవ్ రెండు, వరుణ్ చక్రవర్తి రెండు, జడేజా ఒక వికెట్ తీయడంతో న్యూజిలాండ్ స్కోరు తగ్గింది. ఒక దశలో రన్ 7.45 వరకూ ఉన్నది 4.45 వరకూ పడిపోయిందంటే అది స్పిన్నర్ల పుణ్యమే. స్పిన్నర్లు రన్ లు రాకుండా చాలా పొదుపుగా చేయడంమే కాకుండా విలువైన వికెట్లను వెంటవెంటనే తీయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో న్యూజిలాండ్ బ్యాటర్లు మన స్పిన్నర్లను ఎదుర్కొనడానికి ఇబ్బందులు పడ్డారు. ఎక్కువగా సింగిల్స్ కే పరిమితమయ్యారు. ఫోర్లు, సిక్సర్లు కొట్టడం అనేది చాలా అరుదుగా జరగడంతో యాభై ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 247 పరుగులు చేయగలుగుతుందన్న అంచనాలున్నాయి.
ఛేదనలో మనోళ్లు...
ఇక ఛేదనలో మనోళ్లు ఏం చేస్తారన్నది చూడాలి. న్యూజిలాండ్ లో కూడా నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. వారిని ఎదుర్కొనడం అంత ఈజీ కాదు. పైగా మనోళ్లు ఫీల్డింగ్ లో నాలుగు క్యాచ్ లు చేజార్చారు. ఒక రన్ అవుట్ చేజేతులా మిస్ చేసుకున్నారు. ఫీల్డింగ్ విషయంలో టీం ఇండియా వెనకబడి ఉందనే చెప్పాలి. న్యూజిలాండ్ బ్యాటర్లలో మిచెల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగిలిన వాళ్లెవరూ అంత భారీ స్కోరు చేయలేకపోయారు. ఇక ఛేదనలో టీం ఇండియా బ్యాటర్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సి ఉంటుంది. రన్ రేట్ తక్కువగా ఉండటంతో టీం ఇండియాకు ఈఅవకాశం మళ్లీ దొరకదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ఓపెనర్ల నుంచి అందరూ జాగ్రత్తగా ఆడాలన్న కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి.
Next Story