Sun Dec 22 2024 11:44:31 GMT+0000 (Coordinated Universal Time)
తండ్రైన బుమ్రా.. కొడుకుకు ఏ పేరు పెట్టాడంటే?
భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయ్యాడు
భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయ్యాడు. బుమ్రా సోమవారం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తనకు కొడుకు పుట్టిన వార్తను పంచుకున్నాడు. “మా చిన్న కుటుంబం పెద్దదైంది. మా హృదయాలు ఊహించలేనంత నిండుగా ఉన్నాయి! ఈ ఉదయం మేము మా కుమారుడు అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాము. మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. మా జీవితంలోని ఈ కొత్త అధ్యాయం కోసం ఎంతగానో ఎదురుచూశాం.మా కుటుంబంలో ఎంతో ఆనందం నెలకొంది” అని బుమ్రా చెప్పుకొచ్చాడు. 29 ఏళ్ల బుమ్రా ఆదివారం శ్రీలంకలోని భారత జట్టు నుండి ముంబైలో తన భార్య సంజనా గణేశన్ డెలివరీ కోసం వచ్చాడు. దీంతో సోమవారం నేపాల్‌తో జరిగే మ్యాచ్ ను ఆడలేకపోయాడు.
నేపాల్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే, సూపర్-4కు అర్హత సాధిస్తుంది. భారత్ సూపర్-4కు క్వాలిఫై అయితే సెప్టెంబర్ 10న తమ తదుపరి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సమయానికి బుమ్రా అందుబాటులోకి రానున్నాడు. గాయం కారణంగా దాదాపు ఏడాది తర్వాత బుమ్రా ఐర్లాండ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. పునరాగమనంతోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. పాకిస్తాన్‌తో రద్దైన మ్యాచ్‌లో బుమ్రా బ్యాట్ తో 16 పరుగులతో రాణించాడు.
Next Story