Wed Dec 25 2024 13:00:14 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఐపీఎల్ మెగా వేలం
ఈరోజు, రేపు ఇండియన్ ప్రిమియర్ లీగ్ మోగా వేలం జరుగుతుంది.
ఈరోజు, రేపు ఇండియన్ ప్రిమియర్ లీగ్ మోగా వేలం జరుగుతుంది. సౌదీ అరేబియాలో జెడ్డా వేదికగా మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఐపీఎల్ వేలం ప్రారంభం కానుంది. ఈ వేలంలో క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ప్రయత్నాలు చేస్తాయి. ఎవరికి ఎంత ధర పలుకుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
రిషబ్ పంత్ కు...
ఐపీఎల్ వచ్చే ఏడాది మార్చి నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నేటి నుంచి మెగా వేలం ప్రారంభం కానుంది. మెగా వేలంలో రిషబ్‌పంత్ కు రికార్డ్ ధర పలికే ఛాన్స్ ఉందని తెలిసింది. వికెట్ కీపర్ గా మాత్రమే కాదు బ్యాటర్ గా ఫామ్ లో ఉన్న పంత్ ను చేజిక్కించుకునేందుకు ఫ్రాంచేజీలు ప్రయత్నిస్తాయి. ఈ వేలంలో 577 మంది ఆటగాళ్లకోసం పోటీపడుతున్నాయి. మొత్తం పది ఫ్రాంచైజీలు. 577 మందిలో 397 మంది భారత ఆటగాళ్లు, 210 మంది విదేశీ ఆగగాళ్లు ఉన్నారు.
Next Story