Mon Dec 23 2024 12:42:28 GMT+0000 (Coordinated Universal Time)
సింధూ ఖాతాలో మరో టైటిల్
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ భారత షట్లర్ పీవీ సింధూ సొంతం చేసుకుంది. సింధూ ఖాతాలో మరో టైటిల్ చేరింది
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ భారత షట్లర్ పీవీ సింధూ సొంతం చేసుకుంది. సింధూ ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో థాయలాండ్ క్రీడాకారణి బుసానన్ పై పీవీ సిందూ రెండు సెట్లలోనే విజయం సాధించింది. కేవలం 40 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించి పీవీ సింధూ టైటిల్ ను సొంతం చేసుకుంది. థాయ్ లాండ్ క్రీడాకారిణి పై పూర్తి డామినేషన్ ను పీవీ సింధూ ప్రదర్శించింది.
ఈ ఏడాదిలో రెండోది....
ఈ ఏడాదిలో పీవీ సింధూ గెలుచుకున్న రెండో టైటిల్ ఇది. అంతకు ముందు సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీని పీవీ సింధూ గెలుచుకుంది. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ని పీవీ సింధూ కైవసం చేసుకోవడంతో దేశ వ్యాప్తంగా ఆమె పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story