Fri Nov 15 2024 07:02:10 GMT+0000 (Coordinated Universal Time)
గిల్ ఆరోగ్యంపై కీలక అప్డేట్
అనారోగ్యం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు దూరమైన భారత జట్టు ఓపెనర్
అనారోగ్యం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు దూరమైన భారత జట్టు ఓపెనర్ శుభమాన్ గిల్.. ఆసుపత్రిలో ఉన్నాడనే వార్త అభిమానులను షాక్ కు గురిచేసింది. చెన్నై లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిల్ డిశ్చార్జ్ అయ్యాడు. బుధవారం నాడు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు ముందు శుభమాన్ గిల్ అనారోగ్యంతో చెన్నై ఆసుపత్రిలో చేరాడు. స్టార్ ఓపెనర్ భారత జట్టుతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ తో తలపడేందుకు ఢిల్లీకి వెళ్లలేదు. అక్టోబర్ 14న జరగబోయే పాకిస్తాన్ మ్యాచ్‌లో కూడా అతడు పాల్గొంటాడో లేదో అనే సందేహం ఉంది.
శుభమాన్ గిల్ డెంగ్యూ నుంచి కోలుకున్నాడని.. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ కోసం ఢిల్లీకి వెళ్లే ముందు గిల్ ప్లేట్లెట్ కౌంట్ పడిపోయిందని.. దాంతో గిల్ చికిత్స తీసుకునేందుకు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. BCCI వైద్య బృందం కూడా అతనిని పర్యవేక్షిస్తోంది. చికిత్స అనంతరం శుభమాన్ గిల్ మంగళవారం ఉదయం చెన్నైలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అక్టోబరు 11న న్యూ ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ తో భారత్ తలపడనుంది. శనివారం అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో శుభ్‌మన్ పాల్గొనడంపై ఉత్కంఠ కొనసాగుతూ ఉంది.
Next Story