Mon Dec 23 2024 17:40:11 GMT+0000 (Coordinated Universal Time)
సానియాకు నేడు గ్రాండ్గా ఫేర్వెల్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నేడు హైదరాబాద్లో తన చివరి మ్యాచ్ ఆడనున్నారు.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నేడు హైదరాబాద్లో తన చివరి మ్యాచ్ ఆడనున్నారు. సానియా మీర్జా తన కెరీర్లో ఇదే చివరి ఆటగా మిగిలిపోనుంది. ఇప్పటికే సానియా మీర్జా టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకిష్టమైన హైదరాబాద్లో చివరి మ్యాచ్ను ఆడాలని నిర్ణయించుకున్నారు. ఎల్బీ స్టేడియంలో చివరి మ్యాచ్ ను సానియా మీర్జా ఆడబోతున్నారు.
చివరి మ్యాచ్ కోసం...
ఈ మ్యాచ్కు సానియా కుటుంబ సభ్యులతో పాటు ఆమె అభిమానులు కూడా హాజరవుతున్నారు. ఘనంగా ఫేర్వెల్ చెప్పనున్నారు. ఉదయం పది గంటలకు ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇకపై ఆటకు గుడ్ బై చెప్పి కుటుంబ సభ్యల కోసం ఎక్కువ సమయం గడపనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సానియా మీర్జా రెండు దశాబ్దాలపాటు సానియా మీర్జా టెన్నిస్ ఆడి అభిమానులను అలరించారు. 2003లో ఆమె తొలిసారిగా టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టారు. తన కెరీర్ లో మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలుచుకున్నారు.
Next Story