Fri Dec 20 2024 20:37:23 GMT+0000 (Coordinated Universal Time)
సూర్య విఫలం.. అయినా భారత్?
న్యూజిలాండ్ - భారత్ ల జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు విజృంభించారు
న్యూజిలాండ్ - భారత్ ల జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు విజృంభించారు. భారత్ బ్యాటర్లు చెలరేటి ఆడటంతో ఇండియా భారీ స్కోరు చేయగలిగింది. యాభై ఓవర్లలో 306 పరుగులు చేసింది. ఇందులో శుభమన్ గిల్ 50, శిఖర్ ధావన్ 72, శ్రేయస్ అయ్యర్ 80 పరుగులు చేసి మంచి స్కోరును అందించారు. ఈసారి కూడా పంత్ విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ నాలుగు పరుగులు చేసి అవుటయ్యాడు. సంజూ శ్యాంసన్ కూడా 36 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా 37 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.
కుదరుగానే
ఇక తర్వాత న్యూజిలాండ్ బ్యాటింగ్ కు దిగింది. 307 పరుగుల లక్ష్యంతో దిగిన న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతానికి నిలకడగా ఆడుతూనే ఉంది. ఓపెనర్లుగా దిగిన అలెన్, కాన్వెలు ఒక వైపు ఫోర్లు కొడుతూనే స్కోరు బోర్డును పరుగులు తీయిస్తున్నారు. ఐదు ఓవర్లకు వికెట్ ఏమీ కోల్పోకుండా న్యూజిలాండ్ 33 పరుగులు చేసింది. అలెన్ 21, కాన్వే 11 పరుగులు చేశారు. ఇద్దరూ క్రీజ్ లో కుదురుకున్నారు.
- Tags
- india
- new zealand
Next Story