Mon Dec 23 2024 15:51:11 GMT+0000 (Coordinated Universal Time)
సిరీస్ కోసం ఇరు జట్లు.. నేడు ఆఖరి వన్డే
దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి వన్డే నేడు జరగనుంది. ఈ మ్యాచ్ తో సిరీస్ ఎవరిదో తేలిపోనుంది
దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి వన్డే నేడు జరగనుంది. ఈ మ్యాచ్ తో సిరీస్ ఎవరిదో తేలిపోనుంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించగా, రెండో వన్డేలో భారత్ నెగ్గింది. దీంతో సిరీస్ సమంగా ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్ లో సిరీస్ ఎవరి పరం కానుందీ తేలిపోనుంది. రెండు జట్లు పట్టుదలతో చివరి వన్డేకు కసరత్తు చేస్తున్నాయి. ఎలాంటి ప్రయోగాలు చేయకుండా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ లు వరసగా రెండు మ్యాచ్ లలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో సత్తా చాటాలని చూస్తున్నారు.
దక్షిణాఫ్రికాకు కూడా...
రెండు మ్యాచ్ లలో శిఖర్ థావన్ కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. గిల్ కూడా దాదాపు అంతే. గత మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లు జట్టు విజయంలో కీలకంగా మారారు. సంజూ జాన్సన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా జట్టును కూడా అంత తేలిగ్గా తీసిపారేయలేం. టీ 20 సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు ఈ వన్డే సిరీస్ ను అయినా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంటుంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ వేదికగా జరగనుంది.
Next Story