Mon Dec 23 2024 15:34:27 GMT+0000 (Coordinated Universal Time)
నేడు దక్షిణాఫ్రికాతో ఇండియా రెండో వన్డే
నేడు దక్షిణాఫ్రికాతో ఇండియా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. సిరీస్ కు ఈ మ్యాచ్ కీలకం కానుంది
నేడు దక్షిణాఫ్రికాతో ఇండియా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. సిరీస్ కు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తేనే మరో మ్యాచ్ సిరీస్ ఎవరి పరం అవుతుందన్నది తేలుతుంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా చేతిలో ఇండియా ఓటమి పాలయింది. బౌలింగ్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ కు వెన్నునొప్పి కారణంగా దీపక్ చాహర్ దూరమయ్యాడు. దీపక్ చాహర్ స్థానంలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను బీసీసీఐ ఎంపిక చేసింది.
బౌలింగ్ పరంగా...
అయితే బౌలింగ్ పరంగా భారత్ బలహీనంగా కనిపిస్తుంది. మహ్మద్ సిరాజ్ ఖాన్, ఆవేశ్ ఖాన్ లు ఏ మేరకు రాణిస్తారో చెప్పలేని పరిస్థితి. తక్కువ స్కోరుకు పరిమితం చేయగలిగితేనే ఎవరికైనా విజయం సులువుగా లభిస్తుంది. బ్యాటింగ్ లోనూ మరింత బలపడాల్సి ఉంది. తొలి వన్డేలో శిఖర్ ధావన్, శుభమన్ గిల్ లు త్వరగా అవుటయి ఇతర బ్యాటర్లపై వత్తిడి పెంచారు. మొన్న జరిగిన వన్డేలో సంజూ శాంసన్ కారణంగా పరువు దక్కింది. శాంసన్ లేకపోతే అతి తక్కువ పరుగులకు పూర్తిగా చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఈరోజు రాంచీలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తుంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.
Next Story