Sun Mar 02 2025 22:22:27 GMT+0000 (Coordinated Universal Time)
Virat Kohli : ఎక్కడైనా ఒకే ఆటతీరా... కోహ్లీ ఇదేంది భయ్యా.. ఇలాగయితే ట్రోఫీని నాకించేసినట్లే
భారత్ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కొహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు.కానీ ఫామ లో లేక అవస్థలు పడుతున్నాడు

భారత్ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కొహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. కోహ్లి కొట్టే షాట్ల కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. కానీ విరాట్ కోహ్లి గత కొంత కాలంగా నిరాశపరుస్తున్నారు. ఎంతగా అంటే.. గతంలో కోహ్లి బ్యాట్ నుంచి వచ్చిన సొగసైన షాట్లను చూసి చాలా రోజులయింది. అన్నింటా వరస వైఫల్యాలు కోహ్లి ఫామ్ ను ప్రశ్నిస్తున్నాయి. న్యూజిలాండ్ తో సొంత గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ లోనూ విరాట్ విఫలమయ్యాడు. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లోనూ పెద్దగా పెర్ ఫార్మెన్స్ చూపించలేదు. అయినా సరే విరాట్ కోహ్లిని త్వరలో జరగనున్న టీ 20 ఛాంపియన్ షిప్ కు ఎంపిక చేశారు. ఈ లోపు ఫామ్ లోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
సీనియర్ ఆటగాళ్లందరూ...
అందుకే సీనియర్ ఆటగాళ్లను రంజీట్రోఫిలో ఆడాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే రంజీ ఆటల్లోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు విఫలం కావడంతో ఇక ఛాంపియన్ ట్రోఫీలో ఎలా నెగ్గుకు వస్తారన్నది అనుమానంగానే ఉంది. విరాట్ కోహ్లి ఢిల్లీ తరుపున దాదాపు పన్నెండేళ్ల తర్వాత తొలిసారి రంజీ ట్రోఫి ఆడుతున్నారు. రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి విరాట్ కోహ్లి ఆరు పరుగులకే అవుటయ్యాడు. మామూలుగా కాదు వికెట్ ఎగిరి అవతల పడింది. విరాట్ కోహ్లి ఆట చూసిన వాళ్లకు ఇంకా మారలేదన్న అభిప్రాయం మరింత బలపడింది. రైల్వేస్ బౌలర్ సంగ్వాన్ విరాట్ వికెట్ ను తీసుకుని సంబరాలు చేసుకున్నాడు.లైన్ అండ్ లెంగ్త్ బంతిని ఆడటంలో విరాట్ పూర్తి గా బ్యాట్ ఎత్తేశాడు.
రంజీలోనే అవస్థలు పడుతుంటే..?
రంజీలోనే దేశవాళీ ఆటగాళ్లతో ఇలా తంటాలుపడుతుంటే ఇక ఛాంపియన్ ట్రోపీలో ఎలా ఆడతారన్న ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం లేదు. గత కొంత కాలం నుంచి ఫామ్ కోల్పోయిన సీనియర్లను వెనకేసుకు వస్తున్న బీసీసీఐ ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని సోషల్ మీడియాలో నెట్టింట ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఇద్దరూ ఫామ్ లో లేకుండా ఛాంపియన్ షిప్ ట్రోఫీని ఎలా గెలుచుకుందామని ఊపుకుంటూ వెళుతున్నారని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భారత్ పరువు కాపాడాలంటే నిర్దాక్షణ్యమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద సీనియర్ ఆటగాళ్లు జట్టుకు భారంగా మారారు.
Next Story