Sun Dec 22 2024 23:06:35 GMT+0000 (Coordinated Universal Time)
మనదే ఆసియా కప్?
ఇండియా లక్ష్యం యాభై ఒక్క పరుగులు. యాభై ఓవర్లకు ఇండియా యాభై ఒక్క పరుగులు చేయాలి.
భారత్ - శ్రీలంక మధ్య ఆసియా కప్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అందరూ భావించాం. సండే మంచి మజా దొరుకుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురయింది. ఇంత తక్కువ పరుగులకు ఫైనల్ పోరులో చేతులెత్తేయడం బహుశ ఇదే ఫస్ట్ టైమ్ కావచ్చు. కేవలం యాభై పరుగులకు ఆల్ అవుట్ అయిన శ్రీలంక ఆటగాళ్ల చేతకాని తనానికి బాధపడలా? వరసగా వికెట్లు కూల్చిన భారత ఆటగాళ్ల మెరుపు బౌలింగ్ చూసి మెచ్చుకోవాలో కూడా అర్థం కావడం లేదు. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు, హార్దిక్ పాండ్యా మూడు, బుమ్రా ఒక వికెట్ తీయడంతో శ్రీలంక కథ ముగిసింది. ఐదుగురు శ్రీలంక ఆటగాళ్లు డకౌట్ అవ్వడం విశేషం.
టార్గెట్ 51...
ఇప్పుడు ఇండియా లక్ష్యం యాభై ఒక్క పరుగులు. యాభై ఓవర్లకు ఇండియా యాభై ఒక్క పరుగులు చేయాలి. అంటే రన్ రేట్ ఒకటి మాత్రమే. ఇంత స్వల్ప స్కోరు ఏ పోరులోనూ చూసి ఉండం కాబోలు. కేవలం ఆసియా కప్ లోనే తొలిసారి చూడాల్సి వచ్చింది. యాభై పరుగులకు శ్రీలంక వికెట్లన్నీ టపా టపా పడి పోవడంతో ఇక టీం ఇండియాదే ఆసియా కప్ అని చెప్పుకోవచ్చు. పదిహేను ఓవర్లలోనే చాపచుట్టేసినట్లు చుట్టేశారు. ఎవరూ పదికి మించి పరుగులు చేయలేకపోయారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనుకోని అద్భుతం జరిగితే తప్ప ఇండియా ఆసియా కప్ సాధించినట్లే. శ్రీలంక చరిత్రలోనే అతి తక్కువ స్కోరు అని చెప్పాలి.
Next Story