Sat Mar 15 2025 18:40:04 GMT+0000 (Coordinated Universal Time)
క్లీన్ స్వీప్... భారత్ దే విజయం
వెస్టిండీస్ లో భారత్ పర్యటన శుభారంభాన్ని ఇచ్చింది. వన్డే ల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఇక టీ 20 సిరీస్ పై భారత్ కన్నేసింది

వెస్టిండీస్ లో భారత్ పర్యటన శుభారంభాన్ని ఇచ్చింది. వన్డే ల్లో క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలోనైనా గెలవాలనుకున్న వెస్టిండీస్ ఆశలు గల్లంతయ్యాయి. 119 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి మూడు మ్యాచ్ లను కైవసం చేసుకుని భారత్ పరాయి దేశంలో రికార్డును నెలకొల్పింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 36 ఓవర్లకు 225 పరుగులు చేసింది. అయితే వర్షం కురియడంతో మ్యాచ్ చాలా సేపు ఆగింది. తిరిగి ప్రారంభం కావడంతో డక్వర్త్ లూయీస్ పద్ధతిలో 35 ఓవర్లలో 257 పరుగులు చేయాల్సి వచ్చింది.
26 ఓవర్లలోనే....
తర్వాత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయింది. సిరాజ్ తొలి ఓవర్ ముగిసేలోగానే రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. తర్వాత టపా టపా వెస్టిండీస్ వికెట్లు పడిపోవడంతో 26 ఓవర్లకు 137 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ వన్డేలో క్లీన్ స్వీప్ చేసింది. పరాయి దేశంలో వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసేసింది. భారత్ రికర్డు సృష్టించింది. సొంతగడ్డపైనే వెస్టిండీస్ కు వన్డే మ్యాచ్ లలో పరాభవం చవి చూడాల్సి వచ్చింది. వరసగా మూడు వన్డేలను గెలిచిన భారత్ తర్వాత జరిగే టీ 20 సిరీస్ పై కూడా కన్నేసింది.
Next Story