Mon Dec 23 2024 11:00:40 GMT+0000 (Coordinated Universal Time)
8 ఓవర్ల మ్యాచ్.. భారత్ ముందు భారీ లక్ష్యం
నాగపూర్ లో భారత్, ఆసీస్ జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ను 8 ఓవర్ల మ్యాచ్ గా ప్రకటించారు.
నాగపూర్ లో భారత్, ఆసీస్ జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ను 8 ఓవర్ల మ్యాచ్ గా ప్రకటించారు. వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలుపెట్టారు. అంపైర్లు ఓవర్లు తగ్గించి మ్యాచ్ జరపాలని నిర్ణయించారు. మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు నితిన్ మీనన్, కేఎన్ అనంతపద్మనాభన్ 8 ఓవర్ల మ్యాచ్ జరుపుతున్నట్టు వెల్లడించారు. ఒక్కో జట్టు 8 ఓవర్లు ఆడుతుందని, పవర్ ప్లేలో 2 ఓవర్లు ఉంటాయని, ఒక బౌలర్ రెండు ఓవర్లకు మించి బౌలింగ్ చేయకూడదని తాత్కాలిక నిబంధనలను వివరించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ లోనూ మ్యాథ్యూ వేడ్ దూకుడుగా ఆడి.. 8 ఓవర్లలో భారీ స్కోర్ ను అందించాడు. ఓపెనర్ ఫించ్ 31 పరుగులు చేయగా.. గ్రీన్ 5 పరుగులు, మ్యాక్స్ వెల్ డకౌట్, టైమ్ డేవిడ్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆఖర్లో 20 బంతుల్లో వేడ్ 43 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.
Next Story