Mon Nov 18 2024 00:26:52 GMT+0000 (Coordinated Universal Time)
గాయంతో గ్రౌండ్ నుండి వెళ్ళిపోయిన హార్దిక్
వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో టీమిండియాకు
వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయం కావడంతో నొప్పితో మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచులో హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేసేందుకు వచ్చాడు. తొలి ఓవర్ మూడో బంతి వేయగా.. ఈ బంతిని లిటన్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. దానిని కాలితో ఆపేందుకు పాండ్యా ప్రయత్నించాడు. బంతి కాలి మడమకు బలంగా తాకింది. దీంతో పాండ్యా నొప్పితో విలవిల్లాడాడు. పాండ్యా మైదానాన్ని వీడటంతో కోహ్లీ ఆ ఓవర్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం పాండ్యాకు గాయం కావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అతడి గాయంపై బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. హార్దిక్ పాండ్యాకు స్కానింగ్ లు చేయిస్తున్నామని బీసీసీఐ తెలిపింది. హార్దిక్ ఆరోగ్యంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హార్దిక్ పాండ్యా గాయపడటంతో కోహ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. హార్దిక్ మూడు బంతులు వేసిన తర్వాత అతని కాలికి గాయమైంది. దీంతో ఆ ఓవర్‌ను కోహ్లీ పూర్తి చేశాడు. మూడు బంతులు వేశాడు. ఈ మూడు బంతుల్లో ఒక బంతిని డాట్ చేయగా.. మిగతా రెండు బంతులకు రెండు సింగిల్స్ ఇచ్చాడు. కోహ్లీ కొన్నేళ్ల తర్వాత వన్డేల్లో బౌలింగ్ వేశాడు. కోహ్లీ వన్డే కెరీర్ లో 49 ఇన్నింగ్స్ లలో 107 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.
Next Story