Mon Dec 23 2024 01:23:09 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియా గెలుస్తుందనుకున్నారు.. కానీ..!
విండీస్ ను వరుణుడు కాపాడాడు. ట్రినిడాడ్ టెస్టులో ఐదో రోజు ఆటకు వరుణుడు అడ్డంకిగా
విండీస్ ను వరుణుడు కాపాడాడు. ట్రినిడాడ్ టెస్టులో ఐదో రోజు ఆటకు వరుణుడు అడ్డంకిగా మారడంతో భారత్ కు విజయం దూరమైంది. నాలుగో రోజు ఆటలో తన రెండో ఇన్నింగ్స్ ను 2 వికెట్లకు 181 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసిన భారత జట్టు. వెస్టిండీస్ ముందు 365 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 38, రోహిత్ శర్మ 57, శుభ్ మాన్ గిల్ 29 (నాటౌట్), ఇషాన్ కిషన్ 52 (నాటౌట్) పరుగులు చేశారు.
లక్ష్యఛేదనకు బరిలో దిగిన వెస్టిండీస్ జట్టు నాలుగో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్ 28 పరుగులు చేయగా, కిర్క్ మెకెంజీ (0) డకౌట్ అయ్యాడు. ఓపెనర్ తేజ్ నారాయణ్ చందర్ పాల్ 24, జెర్మైన్ బ్లాక్ వుడ్ 20 నాటౌట్ గా నిలిచారు. వెస్టిండీస్ గెలవాలంటే ఇంకా 289 పరుగులు చేయాలి. భారత్ విజయానికి 8 వికెట్లు కావాలి. అయితే భారత్ విజయాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. ఐదో రోజు ట్రినిడాడ్ లో వర్షం పడుతూనే ఉంది. ఒకానొక దశలో 67 ఓవర్ల ఆట సాగుతుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వరుణుడు మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో భారత్ కు నిరాశ ఎదురైంది. దీంతో మ్యాచ్ ను డ్రాగా ప్రకటించారు నిర్వాహకులు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ వేసిన మొహమ్మద్ సిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ను భారత్ 1-0 తో సొంతం చేసుకుంది. వన్డే సిరీస్ గురువారం నుండి మొదలుకానుంది. మొత్తం మూడు వన్డేలు ఆడనుంది భారతజట్టు.
Next Story