Mon Dec 23 2024 02:58:48 GMT+0000 (Coordinated Universal Time)
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. టైటిల్ పోరుకు సిద్ధమైన చెన్నై, గుజరాత్
ఎంఎస్ ధోనీ సారథ్యంలోని సీఎస్కే ఐదో టైటిల్ కోసం.. హార్దిక్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్..
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని సీఎస్కే ఐదో టైటిల్ కోసం.. హార్దిక్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ట్రోఫీని కాపాడుకునేందుకు రంగంలోకి దిగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇక్కడి పిచ్, ఈ మ్యాచ్లో టాస్ పాత్రపై ఓ లుక్కేద్దాం. అహ్మదాబాద్ ఈ సీజన్లో హై స్కోరింగ్ వేదికగా నిలిచింది. ఇక్కడ జరిగిన ఎనిమిది మ్యాచ్ల్లో మొదటి ఇన్నింగ్స్లలో 193 సగటుతో పరుగులు చేశాయి జట్లు. ఇందులో ఐదు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి.
ఈ మ్యాచ్లో టాస్కు పెద్దగా ప్రాథాన్యత ఉండదు. ఈ నేపథ్యంలో టైటాన్స్, సీఎస్కే బోర్డుపై వీలైనన్ని పరుగులు ఉంచడానికి ప్రయత్నం చేస్తాయి. ఫైనల్ వంటి మ్యాచ్లో టాస్ కంటే జట్టు ప్రణాళికలు ఎక్కువగా పనిచేస్తాయి. ఈ మ్యాచ్లో ఏ కెప్టెన్ ఐనా మునుపటి రికార్డును చూసి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అలా అని.. టాస్ గెలిచిన జట్టుకు ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని దీని అర్థం కాదు. నేటి మ్యాచ్లో ఏ జట్టు రాణిస్తుందో ఆ జట్టుదే పైచేయి. ఈ ఏడాది రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరగగా.. రెండూ ఒక్కో మ్యాచ్లో విజయం సాధించాయి. వాతావరణం మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు.
Next Story