Thu Dec 19 2024 19:21:18 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : సత్తా ఉన్నోళ్లకు హై డిమాండ్.. కోట్లు పోసైనా కొనుగోలు చేసేందుకు రెడీ
ఐపీఎల్ 2024 వేలం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కీలకమైన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు టీంలు ప్రయత్నిస్తున్నాయి
ఐపీఎల్ 2024 వేలం మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈసారి కీలకమైన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు అన్ని టీంలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల వచ్చే నెల 19వ తేదీ నుంచి వేలం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అందుకే సత్తా ఉన్నోళ్లను సొంతం చేసుకోవాలని ఐపీఎల్ లోని అన్ని జట్లు ప్రయత్నిస్తున్నాయి. వరసగా జరిగిన వన్డే వరల్డ్ కప్లో పెర్ఫార్మెన్స్ చూపిన ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకునేందుకు శ్రమిస్తున్నాయి. కోట్లు ఖర్చు పెట్టయినా సరే వారిని సొంతం చేసుకుంటే కొప్పు కొట్ట వచ్చన్న ఆశతో ఉన్నాయి.
ముగ్గురు ఆటగాళ్లపై....
ఇప్పటికే ముంబయి ఇండియన్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కోసం కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధమయినట్ల వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొన్ని జట్లు కూడా కీలక ఆటగాళ్లు తమ జట్టులోకి తీసుకు వచ్చేందుకు ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముగ్గురు ఆటగాళ్లపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈసారి వారిని సొంతం చేసుకుని కప్పును తమ సొంతం చేసుకోవాలని ఆ టీం మేనేజ్మెంట్ ఉవ్విళ్లూరుతుంది.
ఫైనల్ కు చేరి...
మూడు సార్లు ఫైనల్స్ వరకూ చేరిన రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు కప్పును మాత్రం కొట్టలేకపోయింది. 2009, 2011, 2016లో కప్పు అందినట్లే అంది చేజారిపోయింది. టైటిల్ ను గెలవాలని భావిస్తుంది. ఈసారి వేలంలో గతంలో జరిగిన తప్పులు జరగకుండా కీలకమైన వారిని ఎంపిక చేసుకుని జట్టును మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని తహతహలాడుతుంది. ఆర్సీబీ వేలంలో ఎంత వ్యయం చేసైనా వారిని సొంతం చేసుకుంటే తాము మిగిలిన జట్లకు మంచి పోటీ ఇవ్వడమే కాకుండా 2024 ఐపీఎల్ తమ పరమవుతుందని అంచనాలో ఉంది.
కానీ సొంతం కావాలంటే...
బౌలింగ్ పరంగా స్పిన్నర్ గా రాణిస్తున్న శ్రీలంక ఆటగాడు దునిత్ వెల్లలాగేను కొనుగోలు చేయాలని భావిస్తుంది. నెదర్లాండ్స్ కు చెందిన ఆల్ రౌండర్ బాస్ డీ లీడ్ ను కూడా సొంతం చేసుకుంటే మంచిదనుకుంటోంది. వీరితో పాటు మరో ముగ్గురు కీలక ఆటగాళ్లను కూడా తాము టీంలో చేర్చుకోవాలని చూస్తుంది. మొన్న వరల్డ్ కప్ లో సత్తా చాటిన ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, డారిల్ మిచెల్ ను కూడా తమ పరం చేసుకుని కప్పును తాము గెలుచుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ అనుకుంటుంది. మరి వేలంలో వీరి కోసం ఎన్ని టీంలు పోటీ పడతాయి? ఎవరు? ఎవరికి సొంతమవుతారు? అన్నది మాత్రం అప్పుడే తేలనుంది.
Next Story