Sun Dec 22 2024 21:34:09 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : మార్చి నుంచి ఇక మజా చేసేయండి.. తొలి మ్యాచ్ ధోని వర్సెస్ కొహ్లి
ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. ఐపీఎల్ సీజన్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది
ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చపాక్ వేదికగా జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతానికి పదిహేను రోజుల షెడ్యూల్ ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత పూర్తి షెడ్యూల్ ను విడుదల చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికి మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకూ జరిగే మ్యాచ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మార్చి 22 - చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మార్చి 23 - మొహాలీలో పంజాబ్ కింగ్స్ X ఢిల్లీ క్యాపిటల్స్
మార్చి 23 - కోల్కత్తాలో కోల్కత్తా నైట్ రైడర్స్ X సన్రైజర్స్ హైదరాబాద్
మార్చి 24 - జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ X లఖ్నవూ సూపర్ జెయింట్స్
మార్చి 24 - అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ X ముంబయి ఇండియన్స్
మార్చి 25 - బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X పంజాబ్ కింగ్స్
మార్చి 26 - చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ X గుజరాత్ టైటాన్స్
మార్చి 27 - హైదరాబాద్ లో సన్రైజర్స్ హైదరాబాద్ X ముంబయి ఇండియన్స్
మార్చి 28 - జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ X ఢిల్లీ క్యాపిటల్స్
మార్చి 29 - బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X కోల్కత్తా నైట్ రైడర్స్
మార్చి 30 - లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ X పంజాబ్ కింగ్స్
మార్చి 31 - అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ X సన్రైజర్స్ హైదరాబాద్
మార్చి 31 - విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్ X చెన్నై సూపర్ కింగ్స్
ఏప్రిల్ 1 - ముంబయిలో ముంబయి ఇండియన్స్ X రాజస్థాన్ రాయల్స్
ఏప్రిల్ 02 - బెంగళూరులో లక్నో సూపర్ జెయింట్స్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఏప్రిల్ 03 - విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్ X కోల్కత్తా నైట్ రైడర్స్
ఏప్రిల్ 04 - అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ X పంజాబ్ కింగ్స్
ఏప్రిల్ 05 - హైదరాబాద్లో హైదరాబాద్ X చెన్నై సూపర్ కింగ్స్
ఏప్రిల్ 06 - జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఏప్రిల్ 07 - ముంబయిలో ముంబయి ఇండియన్స్ X ఢిల్లీ క్యాపిటల్స్
ఏప్రిల్ 07 - లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ X గుజరాత్ టైటాన్స్
Next Story